బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి: తలసాని

by Shyam |

<p>దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కరోనా సమయంలో ఆస్పత్రుల ఎదుట ధర్నాలు చేయడం బీజేపీ నేతల చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు. మంగళవారం అసెంబ్లీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, మూఠా గోపాల్‌తో కలిసి మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఎత్తివేయడం ఇష్టానుసారంగా చేసిందన్నారు. ఢిల్లీ మర్కజ్‌లో కరోనా ప్రబలితే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏంచేసిందని ప్రశ్నించారు. కేంద్ర [&hellip;]</p>

బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి: తలసాని
X

దిశ, న్యూస్‌బ్యూరో: బీజేపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కరోనా సమయంలో ఆస్పత్రుల ఎదుట ధర్నాలు చేయడం బీజేపీ నేతల చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు. మంగళవారం అసెంబ్లీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, మూఠా గోపాల్‌తో కలిసి మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించడం, ఎత్తివేయడం ఇష్టానుసారంగా చేసిందన్నారు. ఢిల్లీ మర్కజ్‌లో కరోనా ప్రబలితే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏంచేసిందని ప్రశ్నించారు. కేంద్ర ప్యాకేజీ ఏ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన కరోనా టెస్టింగ్ మిషన్‌ను బెంగాల్‌కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు.

Next Story