ప్రైవేట్ స్కూళ్లకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

by  |
ప్రైవేట్ స్కూళ్లకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఎవరైనా అతిక్రమించి, ఇష్టారీతిన వ్యవహరిస్తే.. ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

అవసరమైతే అఫిలియేషన్స్ కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని స్కూళ్లపై నిఘా పెట్టామని సూచించారు. నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలు సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ నిర్ధారించిన ఫీజులను మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు వసూలు చేయాలని సూచించారు. ఇప్పటికే 30 శాతం సిలబస్ కూడా తగ్గించామని వెల్లడించారు.



Next Story

Most Viewed