- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దత్తత గ్రామంలో ఎమ్మెల్యే సునీత సోడియం స్ప్రే.
<p>దిశ, నల్లగొండ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్ మిశ్రమాన్ని ఫైరింజన్ సాయంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి మంగళవారం స్ప్రే చేశారు. ఈ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకుని , వీధివీధినా పర్యటించి.. సోడియం ద్రావాణాన్ని పిచికారి చేశారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినందున ఉపాధి కోల్పోయిన ప్రజలకు రేపటి నుంచి ప్రభుత్వం ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేస్తోందని […]</p>

దిశ, నల్లగొండ
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్ మిశ్రమాన్ని ఫైరింజన్ సాయంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి మంగళవారం స్ప్రే చేశారు. ఈ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకుని , వీధివీధినా పర్యటించి.. సోడియం ద్రావాణాన్ని పిచికారి చేశారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినందున ఉపాధి కోల్పోయిన ప్రజలకు రేపటి నుంచి ప్రభుత్వం ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేస్తోందని ఆమె తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి, సర్పంచ్ వంటేరు సురేష్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింగ్‌రావు, నాయకులు భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
Tags: carona virus, minister sunitha spray, lockdown, dont come out side






