మేడారం పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్.. అధికారులకు కీలక ఆదేశాలు!

by  |
మేడారం పర్యటనలో మంత్రి సత్యవతి రాథోడ్.. అధికారులకు కీలక ఆదేశాలు!
X

దిశ, ఏటూరునాగరం : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ అయిన శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన, జాతర ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలో పర్యటించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కావల్సిన స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులపై స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి సమీక్షించారు. మంత్రితో పాటు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఉన్నారు.


Next Story

Most Viewed