- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూలే కలలను కేసీఆర్ నిజం చేస్తున్నారు: మంత్రి సత్యవతి
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం పూలే వర్థంతి సందర్భంగా మంత్రి కార్యాలయంలో నివాళులు అర్పించారు. వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధికి పెద్ద పీట వేస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ అనేక చర్యలు చేపడుతూ పూలే కలలు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం పూలే వర్థంతి సందర్భంగా మంత్రి కార్యాలయంలో నివాళులు అర్పించారు. వెనుకబడిన తరగతుల విద్య, ఉపాధికి పెద్ద పీట వేస్తూ వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ అనేక చర్యలు చేపడుతూ పూలే కలలు నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, మహిళలు విద్యావంతులు కావాలనే లక్ష్యంతో తన సతీమణిని విద్యావంతురాలుగా, ఉపాధ్యాయురాలుగా తీర్చి దిద్దిన గొప్ప మహనీయుడని కొనియాడారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఆయన వారసులుగా, వారధులుగా పనిచేస్తామన్నారు.
Next Story






