తెరపైకి ఉమ్మడి రాజధాని అంశం.. ప్రాణాలు పోతుంటే పాస్‌లు, పర్మిషన్లు తెస్తారా? : సజ్జల

89
Sajjala-Ramakrishna-Reddy

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్సులను అడ్డుకోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సరిహద్దుల్లో అంబులెన్సులు ఆపే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో కూడా ఇలాంటి సమస్య లేదని ఒక్క తెలంగాణలోనే ఇలా చేయడం సరికాదన్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బెడ్ల కోసం ఎక్కడైనా ప్రయత్నిస్తారు.

అలాంటి సమయంలో ఆస్పత్రి లెటర్లు, పాసులు తీసుకురావడం సాధ్యపడకపోవచ్చునని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ గైడ్‌లైన్స్ పాటించడం కష్టమని సజ్జల వెల్లడించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను వదిలేశామని గుర్తుచేశారు. అంబులెన్సుల అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో అధికారులు చర్చిస్తున్నారని, ఆవేశాలకు పోయి ఘర్షణలకు దారి తీసుకోవద్దని సజ్జల సూచించారు. కొవిడ్ రోగుల విషయంలో ప్రభుత్వం సమస్య పెద్దదిగా చేయొద్దని.. కేసీఆర్ సర్కార్ మానవత్వంతో ఆలోచించాలన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..