- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు దమ్ముంటే అధికారిక ప్రకటన చేయండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
<p>దిశ, మహేశ్వరం: తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తో కలిసి రైతు మహా ధర్నాను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీ నాయకులు ఢిల్లీ లో ఒకమాట, గల్లీలో ఒకమాట మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]</p>

X
దిశ, మహేశ్వరం: తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో రైతులకు మద్దతుగా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తో కలిసి రైతు మహా ధర్నాను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీ నాయకులు ఢిల్లీ లో ఒకమాట, గల్లీలో ఒకమాట మాట్లాడుతున్నారన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒకలా మాట్లాడితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరొకలా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణలో వరి ధాన్యం కొంటామని అధికారికంగా కేంద్రం నుంచి ఉత్వర్వులు తేవాలని డిమాండ్ చేశారు.
Next Story






