స్కూల్స్ బంద్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితా

by  |
స్కూల్స్ బంద్..  క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితా
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ భయం నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిందని వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్లను నమ్మి తల్లిదండ్రులు అయోమయం చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలను అనుసరించాలని మరోసారి ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పిలుపునిచ్చారు.


Next Story