- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ
by Sridhar Babu |
<p>దిశ, న్యూస్ బ్యూరో: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జెడ్పీ హాల్ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హాల్ ఆవరణలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జెడ్పీ హాల్ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హాల్ ఆవరణలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోందని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story






