- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముదిరాజులకు ఆ పోస్ట్ ఇప్పిస్తా: మంత్రి పువ్వాడ
<p>దిశ ఖమ్మం కల్చరల్: ముదిరాజ్ వన సమారాధన మహోత్సవం ఆదివారం చెరుకూరి గార్డెన్ లో జరిగింది. ఖమ్మం కార్పోరేషన్ కార్పోరేటర్ దోరేపల్లి శ్వేత అధ్యక్షతన ముదిరాజ్ యువ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ వన సమారాధనికు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ లు సామాజికంగా, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని కోరారు. జిల్లాకు చెందిన ముదిరాజ్ లకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ […]</p>

దిశ ఖమ్మం కల్చరల్: ముదిరాజ్ వన సమారాధన మహోత్సవం ఆదివారం చెరుకూరి గార్డెన్ లో జరిగింది. ఖమ్మం కార్పోరేషన్ కార్పోరేటర్ దోరేపల్లి శ్వేత అధ్యక్షతన ముదిరాజ్ యువ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ వన సమారాధనికు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ లు సామాజికంగా, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని కోరారు. జిల్లాకు చెందిన ముదిరాజ్ లకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి వచ్చేట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను ఒప్పిస్తానని తెలిపారు.
తెలంగాణలో ముదిరాజ్ ల పాత్ర కీలకమైందని తెలిపారు. వారి అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడు అండగా ఉంటున్నారని తెలియజేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ముదిరాజులు వివిధ రంగాల్లో తామేంటో నిరూపించుకునే విధంగా ఎదగాలని కోరారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో అత్యున్నత ఉద్యోగ అవకాశాలు సాధించి అందరికి స్ఫూర్తిని ఇవ్వాలని కోరారు.






