వైఎస్ జగన్ గజదొంగ.. తెలంగాణ మంత్రి హాట్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-26 00:00:45  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే.. వైఎస్ జగన్ గజదొంగ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం స్పందించి ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డి ప్రాజెక్టు అక్రమమే అన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కృష్ణా నీటిలో ఎట్టి [&hellip;]</p>

వైఎస్ జగన్ గజదొంగ.. తెలంగాణ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే.. వైఎస్ జగన్ గజదొంగ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం స్పందించి ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డి ప్రాజెక్టు అక్రమమే అన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కృష్ణా నీటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటాను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

Next Story