- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంపై తెలంగాణ మంత్రితో చర్చిస్తాం: పేర్ని నాని
by Vemula.Srinu Prasad |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై త్వరలో తెలంగాణ రవాణాశాఖ మంత్రితో చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చిన కేసులో అరెస్టయిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారంపై శనివారం నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా మంత్రి స్పందించారు. ఒకటి రెండు […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై త్వరలో తెలంగాణ రవాణాశాఖ మంత్రితో చర్చలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చిన కేసులో అరెస్టయిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారంపై శనివారం నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా మంత్రి స్పందించారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ రవాణా మంత్రిని విజయవాడకు చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని కోణాల్లో చర్చించి రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడపడంపై ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఈలోగా అవసరమైతే రెండు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు ఫోన్‌లో ఈ విషయంపై చర్చించి సమావేశ విధివిధానాలను ఖరారు చేస్తారని నాని పేర్కొన్నారు.
Next Story






