కొత్త చ‌ట్టాల‌తో మార్కెట్ల‌కు న‌ష్టం లేదు :నిరంజన్ రెడ్డి

183

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: కేంద్ర ప్ర‌భుత్వం నూత‌నంగా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో మార్కెట్ల‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నిరంజ‌న్‌రెడ్డికి పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో స‌హా ఇత‌ర ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వరంగల్ భద్రకాళి ఆల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక పూజ‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో మార్కెట్లకు జరిగే నష్టం ఏమీ లేదని తెలిపారు. మార్కెటింగ్ వ్యవస్థకు అవసరమైతే రూ.400 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లాభసాటి వ్యవసాయంపై శిక్షణను కల్పిస్తామ‌ని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..