వనపర్తిలో బుల్లెట్ బండిపై సందడి చేసిన తెలంగాణ మంత్రి

by Shyam |

<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం రాత్రి బైక్‌పై తిరుగుతూ దర్శించుకున్నారు. మోటార్ బైక్‌పై కూర్చొని మంత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా మంత్రి నిరంజన్ రెడ్డి బుల్లెట్ బండిపై వినాయకుల దర్శణానికి రావడం పట్ల స్థానికులు హర్షం [&hellip;]</p>

Minister Niranjan Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం రాత్రి బైక్‌పై తిరుగుతూ దర్శించుకున్నారు. మోటార్ బైక్‌పై కూర్చొని మంత్రి వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా మంత్రి నిరంజన్ రెడ్డి బుల్లెట్ బండిపై వినాయకుల దర్శణానికి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story