‘పవన్ కళ్యాణ్ కు "రేబీస్" వ్యాక్సిన్ తక్షణం ఇప్పించండి’

by  |
‘పవన్ కళ్యాణ్ కు రేబీస్ వ్యాక్సిన్ తక్షణం ఇప్పించండి’
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలను ఏపీలో రద్దు చేయడం పై నాగబాబు, మంత్రి పేర్ని నాని కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చు కున్నారు. అయితే వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షోలను ఏపీలో రద్దు చేశారని జనసేన నేతలు మండిపడ్డారు. దీనిపై స్పందిస్తూ మంత్రి పేర్నినాని రాజకీయాలకు, సినిమాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని కౌంటర్ ఇచ్చాడు.

మంత్రి కౌంటర్ కు నాగబాబు…. మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కారోనా వాక్సిన్ తో పాటు రేబీస్ వాక్సిన్ వేసుకోవాలి. మీకు రేబీస్ వ్యాక్సి చాలా అవసరం, రాష్ట్ర రవాణ మంత్రికి వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ. అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

పరోపకారి పాపన్న నాగబాబు గారు పేర్ని నాని వంటి బయిటివారికన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రేబీస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అంటూ పేర్ని నాని నాగబాబు పై ఘాటుగా స్పందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed