ఓపిక పట్టండి.. వాన్ని ఎన్‌కౌంటర్ చేస్తాం: మంత్రి మల్లారెడ్డి (వీడియో)

574

దిశ, మేడ్చల్ టౌన్: హైదరాబాద్ సింగరేణి కాలనీలో రాజు చేతిలో హత్యాచారానికి గురైన చిన్నారికి న్యాయం చేయాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్‌లు పెరుగుతున్నాయి. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చిన్నారి హత్యాచార ఘటన ఘోరమన్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని.. ఎన్‌కౌంటర్ చేస్తామంటూ హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నిందితుడిని మాత్రం ఎన్‌కౌంటర్ చేసే వరకు విడిచిపెట్టమంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..