మంత్రి మల్లారెడ్డికి ఊహించని పరిణామం.. ఝలక్ ఇచ్చిన కాలనీ వాసులు

by  |
mallareddy-minister 1
X

దిశ, జవహర్ నగర్: కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. అయితే పక్కనే ఉన్న దొండ తోట సాయిబాబా కాలనీ వాసుల పెద్ద ఎత్తున మంత్రికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 3వడివిజన్ పరిధిలో దొండ తోట సాయిబాబా కాలనీ ముఖద్వార శంకుస్థాపనకు రాకపోవడంపై మంత్రి మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బల్లి శ్రీనివాస్ ల తీరుపై మండిపడ్డారు. తాము నివసించే కాలనీ ముంపు ప్రాంతమని, డంపింగ్ యార్డ్ కలుషిత విషరసాయనాలు తమ కాలనీలో వచ్చి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కాలనీ సమస్యలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ద్వంద వైఖరి ప్రదర్శిస్తూ, తమ కాలనీ అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు.

స్వంత డివిజన్ లో వ్యతిరేకత.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, టీఆర్ఎస్ పార్టీ లో చేరిన 3వ డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా, శ్రీనివాస్ ల తీరుపై స్థానిక ప్రజలు మండి పడ్డారు. స్థానికంగా కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ తన సతీమణి బల్లి రోజా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇష్టానుసారంగా ద్వంద వైఖరి ప్రదర్శిస్తూ తమను పట్టించుకోవడం లేదన్నారు. వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగు నీరు, వర్షం వస్తే కాలనీ ముంపు, డంపింగ్ యార్డ్ ల విషరసాయనాలు, దుర్గంధం వాసనలతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి మల్లారెడ్డి అండదండలతో తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు . కమాన్ శంకుస్థాపన కూడా జరగకుండా అడ్డుపడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్వంద వైఖరి వీడి కాలనీ అభివృద్ధికి పాటు పడాలని, లేదంటే తమ నిరసనలు తీవ్ర తరం చేస్తామని వారు హెచ్చరించారు.


Next Story

Most Viewed