- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
23న నీరా కేఫ్‌కు శంకుస్థాపన
<p>దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ కు ఈనెల 23న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన, సభ కార్యక్రమాల ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం పర్యవేక్షించారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ కు ఈనెల 23న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన, సభ కార్యక్రమాల ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం పర్యవేక్షించారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నీరా పాలసీని సీఎం ప్రవేశపెట్టారన్నారు. గౌడ్ల ఆత్మగౌరవ భవనానికి కోకాపేటలో ఎంతో విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. నీరా కేఫ్ కోస నెక్లెస్ రోడ్డులో ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐదారు నెలల్లో పూర్తి చేసి నీరా కేఫ్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.






