నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

by Shyam |

<p>దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత హైదరాబాద్‎లో వున్న పరిస్థితులను తెలుసుకోవడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నగరంలో పర్యటించారు. ముందుగా ప్రగతి భవన్ నుంచి బుద్ధభవన్‌ వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు. వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కార్మికులు కావడంతో ఉప్పల్ వరకూ వెళ్ళడానికి వాహనాన్ని ఏర్పాటు చేశారు. తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని బీహార్‎కు చెందిన [&hellip;]</p>

నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత హైదరాబాద్‎లో వున్న పరిస్థితులను తెలుసుకోవడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నగరంలో పర్యటించారు. ముందుగా ప్రగతి భవన్ నుంచి బుద్ధభవన్‌ వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలుకరించారు. వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కార్మికులు కావడంతో ఉప్పల్ వరకూ వెళ్ళడానికి వాహనాన్ని ఏర్పాటు చేశారు. తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని బీహార్‎కు చెందిన ఓ కార్మికుడు చెప్పగా.. జీహెచ్ఎంసి నైట్ షెల్టెర్‌లో బస ఏర్పాటు చేయాలనీ అక్కడే ఉన్న జీ.హెచ్.ఎం.సి అదనపు కమిషనర్ శంకరయ్యను ఆదేశించారు. తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ టీములు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపైన ఎంఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజీత్ ను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్న వివిధ సమస్యల ఫిర్యాదులను జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహాంతి ద్వారా తెలుసుకున్నారు. సమస్యలపైన వచ్చే ఫిర్యాదులను మానవతా దృక్పథంతో స్పందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గోల్నాకా నైట్ షెల్టర్‌ను మంత్రి సందర్శించారు. ఇక్కడకు సమీపంలోని కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ, భయపడవద్దని, ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు ఎర్రగడ్డలో స్ప్రే చేస్తున్న క్రిమి సంహారకాన్ని ప్రత్యక్షంగా ర్యవేక్షించారు. ఈ పర్యటనలో మంత్రితో మేయర్ బొంతు రామ్మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tag: Minister KTR, Corona Visit, Hyderabad, GHMC

Next Story