- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్నాలజీతోనే జీవితాల్లో మార్పు: మంత్రి కేటీఆర్
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు టెక్నాలజీ ఉపయుక్తంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చోట్ల టెక్నాలజీని ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కరోనాతో ఏర్పడిన పరిమితులను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ రిజీనల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా పేరుతో జరిగిన సమావేశంలో మంత్రితో పాటు దక్షిణాసియాకు చెందిన వివిధ దేశాల మంత్రులు, పలు కంపెనీల […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు టెక్నాలజీ ఉపయుక్తంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చోట్ల టెక్నాలజీని ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కరోనాతో ఏర్పడిన పరిమితులను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ రిజీనల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏసియా పేరుతో జరిగిన సమావేశంలో మంత్రితో పాటు దక్షిణాసియాకు చెందిన వివిధ దేశాల మంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కొవిడ్ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఏమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అనే అంశంపై ప్రగతిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరును వివరించారు. వైరస్ నివారణకు సాంకేతిక పరిజ్ఞానం మాకు బాగా ఉపయోగపడిందని తెలిపారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానికంగా జిల్లాధికారులు, గ్రామ పంచాయతీలతో సంభాషించేందుకు సైతం టెక్నాలజీ ఉపయోగపడిందన్నారు. పలు పట్టణాల్లో డిస్ ఇన్ఫెక్టంట్ల పిచికారీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగించామన్నారు.
లాక్‌డౌన్‌లో ప్రజల కదలికల నియంత్రణకు డ్రోన్ పర్యవేక్షణను పోలీస్ సిబ్బంది ఉపయోగించారని, ప్రజలకు కొవిడ్ వైరస్‌పై ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ప్రత్యేకంగా యాప్, వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందన్నారు. టెక్నాలజీ సంక్లిష్ట సమయంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దోహద పడిందన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాటు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మమద్ షాహరియర్ ఆలమ్, మాల్దీవులు ఆర్ధికాభివృద్ది శాఖ మంత్రి ఫయాజ్ ఇస్మాయిల్, సింగపూర్ ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి యస్ ఇశ్వరన్, వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్ అధ్యక్షులు బోర్జే బ్రెండె, వివిధ దేశాల మేధావులు, నిఫుణులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఇంత కీలకమైన సమావేశంలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన వరల్డ్ ఎకానామిక్ ఫోరమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.






