కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

by  |
కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
X

దిశ, న్యూస్​బ్యూరో: పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన పనులు, మున్సిపాలిటీలపై గురువారం హైదరాబాద్​లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన పనులు, కొనసాగుతున్న పనులు, మున్సిపాలిటీల అభివృద్ధికి చేయాల్సిన పనులపై అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని వివరించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను ఖచ్చితంగా అమలు జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్లు ఆర్​వీ కర్ణన్, ఎంవి రెడ్డి, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ స్నేహాలత పాల్గొన్నారు.


Next Story

Most Viewed