వరదలతో మనకు నష్టం లేదు !

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: అనుకున్న విధంగానే గ్రేటర్‌ ఎన్నికలకు వెళ్దామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం గ్రేటర్‌ టీఆర్ఎస్ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ&#8230; ఇప్పటికే జీహెచ్ఎంసీ సవరణ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టిస్తోన్న వరదలతో మనకు నష్టం లేదని.. అది ప్రకృతి వైపరీత్యం మాత్రమేనని తెలిపారు. నేతలందరూ వరద సాయంతో ప్రజలకు దగ్గర కావాలని పిలుపు నిచ్చారు. ఈ విపత్తు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని.. మన పని మనం [&hellip;]</p>

వరదలతో మనకు నష్టం లేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్న విధంగానే గ్రేటర్‌ ఎన్నికలకు వెళ్దామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం గ్రేటర్‌ టీఆర్ఎస్ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఇప్పటికే జీహెచ్ఎంసీ సవరణ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టిస్తోన్న వరదలతో మనకు నష్టం లేదని.. అది ప్రకృతి వైపరీత్యం మాత్రమేనని తెలిపారు. నేతలందరూ వరద సాయంతో ప్రజలకు దగ్గర కావాలని పిలుపు నిచ్చారు. ఈ విపత్తు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని.. మన పని మనం చేసుకుపోదామని స్పష్టం చేశారు.

Next Story