అనర్హులు వస్తున్నారు.. అర్హులకు అన్యాయం చేస్తున్నారు: మంత్రి ఆవేదన

by  |
అనర్హులు వస్తున్నారు.. అర్హులకు అన్యాయం చేస్తున్నారు: మంత్రి ఆవేదన
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సదరం క్యాంప్ ఏర్పాటు చేస్తే చాలు ఇబ్బడిముబ్బడిగా జనం పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు.. అనర్హులు కూడా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోంది. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. సదరం క్యాంపులకు వచ్చే వారిని కట్టడి చేసేందుకు మండల స్థాయిలోనే స్కృటినీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనుండి సదరన్ క్యాంపుల్లో చెకప్ చేసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి ఎంపీడీఓలు సర్టిఫై చేయాలని కోరారు. దీనివల్ల సదరం క్యాంపులకు వచ్చే తాకిడి తగ్గుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. లేనట్లయితే అనర్హులు లబ్ధి పొందే ప్రమాదం ఉందన్నారు.


Next Story

Most Viewed