- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: V6 ఛానల్‌పై మంత్రి పరువునష్టం దావా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ న్యూస్ ఛానల్ V6పై రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరువు నష్టం దావా వేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామంలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 30 గుంటల భూమిపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ V6 ఛానల్‌కు పరువు నష్టం నోటీసులు పంపారు. ఈ నెల 5న v6 ఛానల్‌లో ప్రసారమైన కథనంతో ఫాల్స్ ఎలిగేషన్ చేసి మానసిక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ న్యూస్ ఛానల్ V6పై రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరువు నష్టం దావా వేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామంలో తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 30 గుంటల భూమిపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ పరువుకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ V6 ఛానల్‌కు పరువు నష్టం నోటీసులు పంపారు. ఈ నెల 5న v6 ఛానల్‌లో ప్రసారమైన కథనంతో ఫాల్స్ ఎలిగేషన్ చేసి మానసిక ఆందోళనకు గురి చేశారని నోటీసుల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇందుకుగానూ రూ. కోటి పరువు నష్టంగా పదిరోజుల్లో చెల్లించాలని సూచనలు చేశారు. లేదంటే V6 ఛానల్‌పై తదుపరి చర్యలు తీసుకోవటానికి వెనుకాడబోనని, ఆయన తన న్యాయవాది ద్వారా నోటీసులు ఇచ్చారు.
Next Story






