మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబేనని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌కు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. పదవుల కోసం గుళ్లు, మసీదులు, చర్చిల చుట్టూ తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ [&hellip;]</p>

మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది చంద్రబాబేనని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌కు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయించాలని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. పదవుల కోసం గుళ్లు, మసీదులు, చర్చిల చుట్టూ తిరిగే చంద్రబాబు దేవుళ్ల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.

Next Story