లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by  |
Minister Kodali Nani
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడతాయేమోనని అందరిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని అన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నిర్మూలించొచ్చని తెలిపారు. అంతేగాకుండా.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగఓట్లు పడ్డాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని, అసలు దొంగఓట్లే పడలేదని కొట్టిపారేశారు. ఒకవేళ దొంగ ఓట్లు పడుంటే 90 శాతం పోలింగ్ నమోదయ్యేదని అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed