- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ నడపడం రాదు… పార్టీ నడపడం రాదు
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో లోకేష్ ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి, ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘దొంగలు పడిన ఆరు నెలలకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో లోకేష్ ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి, ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది. వరదలు ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు పరిశీలిస్తున్నారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్.. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా ట్రాక్టర్‌ను ఏ విధంగా కొల్లేటిలోకి దించాడో రేపు టీడీపీని కూడా అదేవిధంగా దించుతాడని స్పష్టం చేశారు.






