ఆయనకు చెరువుకు చేనుకు తేడా తెలియదు..

45

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నాయకులపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్‌కు వరి చేనుకు, చేపల చెరువుకు మధ్య తేడా తెలియదని అన్నారు. లోకేశ్ ఓ వేస్ట్ ఫెలో అంటూ ఆయన విమర్శించారు. లోకేశ్ ఎంత తిరిగినా కూడా ఉపయోగం లేదని ఆయన తెలిపారు. కేవలం అమరావతి రైతులు మాత్రమే రైతులు కాదనీ ఆయన అన్నారు. రైతులకు బేడీలు వేసినందుకు దేవి నేని ఉమ కూడా బేడీలు వేసుకున్నారనీ.. బషీర్ బాగ్ ఘటనకు నిరసనగా తనకు తాను తుపాకీతో దేవినేని ఉమ కాల్చుకోవాలని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.