- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి నాయిని : మంత్రి జగదీష్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంపై దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంపై దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం బీద ప్రజల అభ్యున్నతి కోసమే పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






