- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లదాడి
<p>దిశ, నల్లగొండ: మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలోని లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థాన శంకుస్థాపనకు మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం హజరయ్యారు. ఈ క్రమంలో ఉండ్రుగొండ గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేశాడు. అయితే అప్పటికే మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లింది. నాగరాజు చేసిన రాళ్లదాడిలో మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన నాగరాజు అక్కడి […]</p>

దిశ, నల్లగొండ: మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండలోని లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థాన శంకుస్థాపనకు మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం హజరయ్యారు. ఈ క్రమంలో ఉండ్రుగొండ గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడు మంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేశాడు. అయితే అప్పటికే మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు వెళ్లింది. నాగరాజు చేసిన రాళ్లదాడిలో మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన నాగరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఐ అండ్ పీఆర్ ఫొటోగ్రాఫర్ శోభన్‌తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వీరిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆరా తీశారు. అయితే నాగరాజు అనే యువకుడు గ్రామంలో సైకోలా తిరిగేవాడని, గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడినట్టు కొంతమంది గ్రామస్తులు చెబుతున్నారు.






