నాయిని ఆరోగ్యంపై ఈటల ఆరా

32

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్యులను ఆదేశించారు. శనివారం ఆయన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి అపోలో హాస్పిటల్‌ను సందర్శించారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం అపోలో వైద్యులతో సమావేశమై ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా నర్సింహారెడ్డి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.