ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ప్రదాత

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ భవిష్యత్‌ తరాలకు మార్గ నిర్దేశకుడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నిర్మల్ పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌యశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. తనజీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. యువత జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నిర్మ‌ల్ రూర‌ల్ పోలీస్ [&hellip;]</p>

ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ప్రదాత
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ భవిష్యత్‌ తరాలకు మార్గ నిర్దేశకుడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నిర్మల్ పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌యశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. తనజీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. యువత జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నిర్మ‌ల్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ కూడ‌లిని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాగా మంత్రి నామ‌క‌ర‌ణం చేశారు.

Next Story