- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రారంభించకుండా వెనుదిరిగిన మంత్రి
<p>దిశ, ఆందోల్: జోగిపేట కూరగాయల మార్కెట్‌లో మహిళల కోసం, పది రోజుల క్రితం ఏర్పాటు చేసిన మోబైల్ షీ టాయ్‌లెట్స్‌ను నేటికీ ప్రారంభించలేదు. ఈ నెల 21వ తేదీన మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా, ఆందోలు వరకూ వచ్చి, ప్రారంభించకుండానే తిరిగి వెళ్లి పోయారు. దీంతో ఆరోను నుంచి మోబైల్ షీ టాయ్‌లెట్ వాహనాన్ని క్రీడామైదానంలోని కూరగాయల మార్కెట్‌లోనే ఉంచారు. వాహనం గేట్‌కు తాళం వేసి ఉంచడంతో మహిళలు దాన్ని వినియోగించుకోవడానికి వీలులేకుండా పోయింది. […]</p>

దిశ, ఆందోల్: జోగిపేట కూరగాయల మార్కెట్‌లో మహిళల కోసం, పది రోజుల క్రితం ఏర్పాటు చేసిన మోబైల్ షీ టాయ్‌లెట్స్‌ను నేటికీ ప్రారంభించలేదు. ఈ నెల 21వ తేదీన మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా, ఆందోలు వరకూ వచ్చి, ప్రారంభించకుండానే తిరిగి వెళ్లి పోయారు. దీంతో ఆరోను నుంచి మోబైల్ షీ టాయ్‌లెట్ వాహనాన్ని క్రీడామైదానంలోని కూరగాయల మార్కెట్‌లోనే ఉంచారు.
వాహనం గేట్‌కు తాళం వేసి ఉంచడంతో మహిళలు దాన్ని వినియోగించుకోవడానికి వీలులేకుండా పోయింది. దీంతో వెంటనే ప్రారంభించి, వాడుకలోకి తీసుకురావాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కేశురాంను సంప్రదించగా రూ.4.70 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించాల్సి ఉన్నా, చేయలేకపోయారని, ఎమ్మెల్యేతో చేయించుకోవాలని మంత్రి సూచించగా ఆయన తేదీ కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు.






