ప్రాజెక్ట్ అద్భుతం.. మల్లన్న సాగర్ లో మంత్రి హరీష్ రావ్

by  |
ప్రాజెక్ట్ అద్భుతం.. మల్లన్న సాగర్ లో మంత్రి హరీష్ రావ్
X

దిశ, దుబ్బాక : రైతుల తలరాత మార్చి తరతరాలు చెప్పుకునే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందన్నారు. ప్రాజెక్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11 టీఏంసీల మేర నీళ్లు వచ్చాయని, 30 మీటర్ల ఎత్తు వరకూ పైకి నీళ్లు వచ్చాయని, బండ్ మొత్తం 22 కిలో మీటర్లు ఉండగా దాదాపు 20 కిలో మీటర్ల మేర నీళ్లు చేరినట్లు ఇరిగేషన్ డీఈ సుమన్, జేఈ భరత్ లు మంత్రికి వివరించారు.

అంతకుముందు తొగుట జెడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని లింగాపూర్ లో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. ఇంద్రన్న చనిపోవడం బాధాకరం అని, ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి, మండల ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తొగుట స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed