జూట్ బ్యాగ్ ఉంటే కూరగాయలు.. స్టీల్ బాక్స్ ఉంటే మాంసం

by Shyam |

<p>దిశ, మెదక్: జూట్ బ్యాగు, స్టీల్ బాక్సులతో రానివారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ప్రవేశం లేదని బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జూట్ బ్యాగ్ ఉంటేనే కూరగాయలు, స్టీల్ బాక్సు ఉంటేనే మటన్, చికెన్, చేపల అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు మంత్రి స్పష్టం చేశారు. రెండో విడత పట్టణ ప్రగతి, డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిష్, నాన్‌వెజ్ బ్లాకుల్లో పలుచోట్ల [&hellip;]</p>

జూట్ బ్యాగ్ ఉంటే కూరగాయలు.. స్టీల్ బాక్స్ ఉంటే మాంసం
X

దిశ, మెదక్: జూట్ బ్యాగు, స్టీల్ బాక్సులతో రానివారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ప్రవేశం లేదని బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జూట్ బ్యాగ్ ఉంటేనే కూరగాయలు, స్టీల్ బాక్సు ఉంటేనే మటన్, చికెన్, చేపల అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు మంత్రి స్పష్టం చేశారు. రెండో విడత పట్టణ ప్రగతి, డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిష్, నాన్‌వెజ్ బ్లాకుల్లో పలుచోట్ల దుర్గంధం వెదజల్లుతుండటంతో నిర్వాహకుల తీరుపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో దుకాణదారులైనా, కొనుగోలుదారులైనా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే రూ.500 జరిమానా విధించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మోతుకు ఆకుల్లో మాంసం విక్రయిస్తున్న ఓ మాంసం వ్యాపారిని మంత్రి అభింనందించి రూ.500 నజరానా అందించారు.

Next Story