మనమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం : మంత్రి హరీష్ రావు

by Shyam |

<p>దిశ, మెదక్: ప్రపంచం మొత్తం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మహమ్మారి కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపురం మండల కేంద్రంలో కొనసాగుతున్న నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో ధాన్యం , మొక్కజొన్న కేంద్రాలను మంత్రిప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదని, ప్రజలంతా బయటకు రావొద్దని సూచించారు. అగ్రరాజ్యం [&hellip;]</p>

మనమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం : మంత్రి హరీష్ రావు
X

దిశ, మెదక్: ప్రపంచం మొత్తం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మహమ్మారి కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపురం మండల కేంద్రంలో కొనసాగుతున్న నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో ధాన్యం , మొక్కజొన్న కేంద్రాలను మంత్రిప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదని, ప్రజలంతా బయటకు రావొద్దని సూచించారు. అగ్రరాజ్యం అమెరికా , ఇటలీ లు ఇప్పటికే కరోనాపై పోరాడి ఓడినట్టు వెల్లడించారు.కేవలం 6కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపు చేయలేకపోయింది. అలాంటిది 130కోట్ల జనాభా గల భారత్ పరిస్థితి ఏంటనీ మంత్రి ప్రశ్నించారు. కావున ప్రతిఒక్కరూ లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు. మన ప్రభుత్వం ఒక వైపు కరోనాపై పోరాడుతూనే మరొకవైపు రైతుల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని , ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజని కొనుగోలు చేస్తుందని హామీనిచ్చారు. టోకెన్ల ప్రకారం అందరి పంటను కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రానికి వర్ష సూచనలు ఉన్నాయని వెంటనే రైతులు టార్పాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంజాబ్ నుంచి 150 ప్యాడి మిషన్లు సిద్దిపేటకు తెప్పిస్తున్నామని హరీష్ రావు వివరించారు. కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్ ఇంకో వారం, 15 రోజులు పొడిగించినా ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags: corona, lockdown, minister harish rao, visit nursery

Next Story