పోలీస్‌లకు సెల్యూట్: మంత్రి హరీశ్‌రావు

by Shyam |

<p>విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి కొనియాడారు. సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు పడుతారో మన కోసం పోలీసులు అంతే బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్ విజయవంతం చేయటంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. వారి త్యాగాలకు ఇవ్వగలిగిన గౌరవం, వారికి నా సెల్యూట్ అన్నారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న ఫొటోలను మంత్రి హరీశ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. హరీశ్ రావు ట్వీట్‌కు రాష్ట్ర [&hellip;]</p>

పోలీస్‌లకు సెల్యూట్: మంత్రి హరీశ్‌రావు
X

విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి కొనియాడారు. సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు పడుతారో మన కోసం పోలీసులు అంతే బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్ విజయవంతం చేయటంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. వారి త్యాగాలకు ఇవ్వగలిగిన గౌరవం, వారికి నా సెల్యూట్ అన్నారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న ఫొటోలను మంత్రి హరీశ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. హరీశ్ రావు ట్వీట్‌కు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Tags: Minister Harish rao, Twitter, police, lockdown

Next Story