- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవసరముంటేనే ఎరువులు వాడండి : హారీష్‌రావు
<p>దిశ, వెబ్ డెస్క్: టీఆర్‌ఎస్ సర్కార్ రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని 515మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, 3,484 చెరువులకు గాను 2,500 చెరువులు నిండాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు […]</p>

దిశ, వెబ్ డెస్క్: టీఆర్‌ఎస్ సర్కార్ రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని 515మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హరీశ్‌రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, 3,484 చెరువులకు గాను 2,500 చెరువులు నిండాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు జలకళను సంతరించుకోవడంతో పాటు, మత్తడి దూకుతున్నాయన్నారు. కాళేశ్వరం జలాలతో పాటు దేవుడి దయవల్ల ఈ యేటా వర్షాలు సమృద్ధిగా కురవడంతో యాసంగి పంట బ్రహ్మాండంగా పండనున్నదని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదివరకే పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 5వేల చొప్పున వానకాలం నాట్లు వేసే సమయానికి రూ. 7,300 కోట్లు రైతులకు అందిచామన్నారు. వానకాలంలో రైతుబంధు ఇచ్చామని, ఈ యాసంగికి కూడా రైతుబంధు అందిస్తామని మంత్రి స్పష్టంచేశారు. ఈసారి అవసరానికి మించి ఎరువులు వాడొద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మోతాదుకు అనుగుణంగా యూరియా వేయాలని, ఆ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాన్నారు.
దుబ్బాక అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, నియోజకవర్గంలో 40వేల మెట్రిక్ టన్నుల గోదాములు మంజూరు అయినట్లు, రాయపోల్ మండలం, దుబ్బాక మున్సిపాలిటీ, ఫైర్ స్టేషన్ వచ్చాయని మంత్రి వివరించారు.






