- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నకోడూరులో వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి నూతన వ్యవసాయ క్లస్టర్ మంజూరైనట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సాగు విస్తీర్ణం పెరిగిన దరిమిలా, చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి, సికింద్రాపూర్, మల్లారం గ్రామాలను కలుపుకుని నూతనంగా మల్లారం వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో సాగు విస్తీర్ణం పెరగడంతో నూతనంగా ఈ వ్యవసాయ క్లస్టరును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో రైతు వేదిక నిర్మాణంతో పాటు అదనంగా వ్యవసాయ విస్తరణాధికారి అందుబాటులోకి వస్తారని, ఇందుకు […]</p>

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి నూతన వ్యవసాయ క్లస్టర్ మంజూరైనట్టు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సాగు విస్తీర్ణం పెరిగిన దరిమిలా, చిన్నకోడూరు మండలంలోని మేడిపల్లి, సికింద్రాపూర్, మల్లారం గ్రామాలను కలుపుకుని నూతనంగా మల్లారం వ్యవసాయ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో సాగు విస్తీర్ణం పెరగడంతో నూతనంగా ఈ వ్యవసాయ క్లస్టరును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
దీంతో రైతు వేదిక నిర్మాణంతో పాటు అదనంగా వ్యవసాయ విస్తరణాధికారి అందుబాటులోకి వస్తారని, ఇందుకు అనుగుణంగా ఈ మూడు గ్రామాల రైతులకు మరిన్ని వ్యవసాయ విస్తరణ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. చిన్నకోడూరు మండలంలోని మూడు గ్రామాలైన మేడిపల్లి 1342 ఏకరాలు, మల్లారం 1176 ఏకరాలు, 1504 ఏకరాలు సికింద్లాపూర్ గ్రామాలలో మొత్తం 4022 ఏకరాలకు గానూ నూతన వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు.






