- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి యువత బుద్ధి చెప్పాలి : హరీశ్ రావు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి హరీశ్ రావు పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అన్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో విపరీతంగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మంత్రి హరీశ్ రావు పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని అన్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయిందని వెల్లడించారు. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు తప్ప యువత కోసం బీజేపీ చేసేదేమీ లేదని మండిపడ్డారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి యువత బుద్ధి చెప్పాలని సూచించారు.
Next Story






