సిద్దిపేటలో రంజాన్ తోఫా పంపిణీ

by Shyam |

<p>దిశ, మెదక్: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదలను ఆదుకునేందుకు ముందుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో శనివారం సాయంత్రం రెండో విడతలో 500 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలనే రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా అందరి సమస్య అని మనమంతా ఐక్యంగా పోరాడాలని ప్రజలను మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు [&hellip;]</p>

సిద్దిపేటలో రంజాన్ తోఫా పంపిణీ
X

దిశ, మెదక్: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదలను ఆదుకునేందుకు ముందుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో శనివారం సాయంత్రం రెండో విడతలో 500 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలనే రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా అందరి సమస్య అని మనమంతా ఐక్యంగా పోరాడాలని ప్రజలను మంత్రి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.

Next Story