కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి: మంత్రి హరీశ్‌రావు

by Shyam |   (  Updated:2020-04-14 00:23:48  IST  )

<p>దిశ, మెదక్: విమర్శలు చేసే ముందు ఒక్కసారి గాంధీ ఆస్పత్రికి వెళ్లి చూడాలని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో రెండు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయన్నారు. బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించడం కోసం పోలీసు బందోబస్తుతోపాటు పర్యవేక్షణ కోసం మండల స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కరోనాపై పోరాటం కోసం ప్రపంచం మొత్తం ఏకతాటి [&hellip;]</p>

కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి: మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్: విమర్శలు చేసే ముందు ఒక్కసారి గాంధీ ఆస్పత్రికి వెళ్లి చూడాలని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో రెండు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయన్నారు. బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించడం కోసం పోలీసు బందోబస్తుతోపాటు పర్యవేక్షణ కోసం మండల స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. కరోనాపై పోరాటం కోసం ప్రపంచం మొత్తం ఏకతాటి పైకి వచ్చిందన్నారు. కానీ, దీన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు 643, మొక్కజొన్న 83, శనగలు కొనుగోలు కేంద్రాలు 13 ప్రారంభించామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించామని, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని సూచించామన్నారు. సంగారెడ్డి జిల్లాలో 38,045 మంది వలస కూలీలు ఉన్నట్టు గుర్తించామని, ప్రతి రేషన్‌కార్డుదారుడి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.

Tags : minister Harish Rao, criticized, Congress, BJP, medak, ghandi hospital

Next Story