కేంద్రం అడుగడుగునా అన్యాయం చేసింది

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, మెదక్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఓట్లు అడగవచ్చని ఆ హక్కును ఎవరూ ప్రశ్నిచలేరని అన్నారు. కానీ రాజకీయాల్లో హక్కులతో పాటు బాధ్యతలు వుంటాయని, దుబ్బాకలో మీరు ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఒక తెలంగాణ పౌరుడిగా [&hellip;]</p>

కేంద్రం అడుగడుగునా అన్యాయం చేసింది
X

దిశ ప్రతినిధి, మెదక్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ఓట్లు అడగవచ్చని ఆ హక్కును ఎవరూ ప్రశ్నిచలేరని అన్నారు. కానీ రాజకీయాల్లో హక్కులతో పాటు బాధ్యతలు వుంటాయని, దుబ్బాకలో మీరు ఏ నైతికతతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఒక తెలంగాణ పౌరుడిగా తాను అడుగుతున్న 18 ప్రశ్నలకు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాగానే 7 మండలాలను ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ ప్రభుత్వం కాదా? ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అతి తక్కువకు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే లోయర్‌ సీలేరు హైడెల్ పవర్ ప్లాంటును ఆంధ్రాకు అప్పగించింది బీజేపీ ప్రభుత్వం కాదా? విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా? యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ ఎందుకు ఉపసంహరించుకుందో ప్రజలకు తెలుపాలన్నారు.

కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీని రద్దు చేసింది బీజేపీ కాదా? రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడచినా తెలంగాణకు న్యాయమైన నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తోంది భాజపా కాదా? ఆంధ్రాకు, దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని, తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టు లకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా, ఎందుకు తెలంగాణ పట్ల విద్వేషం‌తో వ్యవహరిస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పడినా ఆంధ్రాకి చెందిన 1153 మంది విద్యుత్‌ ఉద్యోగులు ఇంకా ఇక్కడే పనిచేస్తున్నారని దీని వల్ల ఏటా రూ.1000 కోట్ల భారం పడుతోందన్నారు. ఆంధ్రా ఉద్యోగులను పంపకుండా ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోందని ప్రశ్నించారు. పెన్షన్‌లలో కేంద్రం వాటా కేవలం రూ.200 నే నని, కానీ రూ.1600 ఇస్తున్నాం అంటూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా తూతూ మంత్రంగా కొంతమందికే పెన్షన్ ఇవ్వడంలో తమ ఉద్దేశం తెలుపాలన్నారు.

వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని, దేశ వ్యాప్తంగా టెక్స్‌‌టైల్‌ రంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ.. ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం వరంగల్‌లో నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని అడిగారు. ఆదిలాబాద్‌లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్తామన్నారని, గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తెరవలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని, ఇది బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేస్తోంది అన్యాయం కాదో చెప్పాలన్నారు. తెలంగాణకు మొత్తం రావాల్సిన రూ.12వేల కోట్లు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం లేదా అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం ఏటా రూ.450 కోట్లు ఇవ్వాలని, ఎందుకీ ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. కేంద్రంలో ని తెలంగాణకు చేస్తున్న అన్యాయాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే ఆడిగానని, తాను రాసిన బహిరంగ లేఖపై బండి సంజయ్‌ స్పందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Next Story