విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

by Shyam |

<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి-రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న ఎంట్రన్స్ పరీక్ష రాసింది. కాగా ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది విద్యావంతులను తీర్చిద్ధిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది. ఈ [&hellip;]</p>

విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి-రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న ఎంట్రన్స్ పరీక్ష రాసింది. కాగా ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది విద్యావంతులను తీర్చిద్ధిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది. ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్ట మొదటి విద్యార్థినిగా సిద్దిపేట జిల్లా ఖ్యాతిని వెన్నెల చాటింది. మంచి ర్యాంకు సాధించిన వెన్నెలను ఫోన్‌లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story