- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులు నిండి సంతోషంగా ఉన్నారు….
by Shyam |
<p>దిశ,సిద్దిపేట : అక్కా చెల్లెళ్ళు అందరూ అన్ని దేశాల్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కోమటి చెరువు వద్ద కుటుంబ సమేతంగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆడపడుచులతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలిపారు. కరోనా నేపథ్యంలో చెరువు వద్దకు అనుకున్న స్థాయిలో ప్రజలు రాలేకపోయారని అన్నారు. కరోనా పరిస్థితుల్లో బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లను […]</p>

X
దిశ,సిద్దిపేట :
అక్కా చెల్లెళ్ళు అందరూ అన్ని దేశాల్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కోమటి చెరువు వద్ద కుటుంబ సమేతంగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆడపడుచులతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలిపారు. కరోనా నేపథ్యంలో చెరువు వద్దకు అనుకున్న స్థాయిలో ప్రజలు రాలేకపోయారని అన్నారు. కరోనా పరిస్థితుల్లో బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి చెరువులు కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో చెరువులు నిండి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. కరోనా వల్ల పెద్ద ఎత్తున ప్రజలు రాలేక పోయినా కూడా ఆనందంగా పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
Next Story






