‘కరోనా అంటే నిర్లక్ష్యం వద్దు.. భయపడొద్దు’

by Shyam |   (  Updated:2020-07-09 05:01:43  IST  )

<p>దిశ, మెదక్: కరోనా వైరస్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా, అలాగని ఎక్కువగా భయం చెందకుండా అందరూ దైర్యంగా, పూర్తి జాగ్రత్తతో ఉండాలని మంత్రి హరీశ్ సూచించారు. అలాగే కరోనా సోకిన వారిపై చిన్నచూపు చూడకుండా ఉండాలని, వారికి ధైర్యం చెప్పాలని తెలిపారు. కరోనా వచ్చినా వారూ మనిషే కదా.! కరోనా వచ్చిందని అంటరాని వారిగా చిన్నచూపు చూడొద్దని.. అది మంచి పధ్ధతి కాదని ప్రజలతో ఆయన అన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ [&hellip;]</p>

‘కరోనా అంటే నిర్లక్ష్యం వద్దు.. భయపడొద్దు’
X

దిశ, మెదక్: కరోనా వైరస్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా, అలాగని ఎక్కువగా భయం చెందకుండా అందరూ దైర్యంగా, పూర్తి జాగ్రత్తతో ఉండాలని మంత్రి హరీశ్ సూచించారు. అలాగే కరోనా సోకిన వారిపై చిన్నచూపు చూడకుండా ఉండాలని, వారికి ధైర్యం చెప్పాలని తెలిపారు. కరోనా వచ్చినా వారూ మనిషే కదా.! కరోనా వచ్చిందని అంటరాని వారిగా చిన్నచూపు చూడొద్దని.. అది మంచి పధ్ధతి కాదని ప్రజలతో ఆయన అన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ 6వ వార్డులో రూ.220 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై అందరికీ అవగాహన కల్పించారు. ఎవరూ కరోనా కావాలని తెచ్చుకోరని, గాలికి సోకతుందని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉంటే కరోనా దరిచేరకుండా ఉంటుందని సూచించారు. ఈ నెల 15వ తేదీ నుంచి కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభించనున్నట్టు, 100 మందికి సరిపడేలా వంద పడకల కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తూ., కరోనా ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

Next Story