- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయం పెంపు : ఈటల
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయాన్ని మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈవెనింగ్ క్లినిక్‌లు మొదలు పెట్టనున్నట్లు నిర్ణయించారు. ఇకమీదట సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బస్తీవాసులకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్లో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్సీల్లో ఓపీ సేవల సమయాన్ని మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈవెనింగ్ క్లినిక్‌లు మొదలు పెట్టనున్నట్లు నిర్ణయించారు.
ఇకమీదట సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బస్తీవాసులకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలని మంత్రి ఈటల సూచించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున.. సీజనల్ వ్యాధులు నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
Next Story






