దిశ, హుజూరాబాద్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ, అనతి కాలంలోనే ప్రజల మన్ననలు “దిశ” దినపత్రిక పొందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దిశ 2021 క్యాలెండర్‌ను శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజాలను నిర్భయంగా రాస్తూ అతి తక్కువ సమయంలో ప్రజలకు దిశ చేరువైందని అన్నారు.
సమాజంలో పత్రిక రంగానికి విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ మక్కపల్లి కుమార్, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, దిశ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్టీ పొలాటి లక్ష్మణరావు పాల్గొన్నారు.