- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా ఉద్యమాల్లో ఆయనది కీలకపాత్ర : ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రజా ఉద్యమాల్లో పముఖ వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కీలక పాత్ర పోషించారని పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మృతి పట్ల ఎర్రబెల్లి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏంపిల్లడో ఎల్ధామొస్తవా.. అంటూ ప్రజలను చైతన్య పరిచిన ప్రజల పాట వంగపండు అని కొనియాడారు. ఎల్దామొస్తవా అంటూ తానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందినవాడైనా తెలంగాణకు మద్దతు పలికిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజా ఉద్యమాల్లో పముఖ వాగ్గేయకారుడు, ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు కీలక పాత్ర పోషించారని పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మృతి పట్ల ఎర్రబెల్లి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏంపిల్లడో ఎల్ధామొస్తవా.. అంటూ ప్రజలను చైతన్య పరిచిన ప్రజల పాట వంగపండు అని కొనియాడారు.
ఎల్దామొస్తవా అంటూ తానే కానరాని లోకాలకు వెళ్లిపోయాడని విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందినవాడైనా తెలంగాణకు మద్దతు పలికిన వంగపండును తెలంగాణ ప్రజలు మర్చిపోరని గుర్తుచేశారు విప్లవోద్యమమైనా, ప్రజల పాటైనా తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకూ కట్టుబడిన వ్యక్తి వంగపండు అని చెప్పారు. వంగపండు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని మంత్రి ఎర్రబెల్లి ప్రార్ధించారు.
Next Story






