విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్యాశాఖ మంత్రి

by  |
sabitha
X

దిశ, మహేశ్వరం: కొవిడ్ నిబంధలను పాటిస్తూ, ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్ధం అవుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించిందని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులను పాఠశాలకు రావడం ఎలా ఉందని? ఇంట్లో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళమంటున్నారా? అని విద్యార్థులను మంత్రి ఆరా తీశారు.

అనంతరం కోట మైసమ్మ, పోచమ్మ బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొవిడ్ గురించి అవగహన కల్పించి, ప్రతి విద్యార్థి మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుశీంద్రరావు, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంద్యనాయక్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేష్, ఎంఈవో కృష్ణ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed